నాణ్యమైన విద్య ద్వారా పేద వర్గాల వెనుకబాటుతనం నిర్మూలనకు సిఎం కేసిఆర్ కృషి

రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్ :దేశ, విదేశాల్లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన గిరిజన గురుకులాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఆర్ధిక సాయం చేస్తోందని, ల్యాప్ టాప్ లను ఇస్తోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. గిరిజన గురుకులాల విద్యార్థులకు ఐఐటి, ఎన్.ఐ.టిలలో ట్యూషన్ ఫీజ్ మినహాయింపు ఉందని, అదనంగా స్కాలర్ షిప్ కూడా వస్తుందన్నారు. నీట్ ద్వారా ఎంబీబీఎస్, బిడిఎస్ కోర్సుల్లో సీట్లు పొందుతున్నారని, వీరికి ప్రోత్సాహకంగా ఆర్ధిక సాయం అందిస్తున్నామన్నారు. విదేశాల్లో చదివితే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం కింద 20 లక్షల రూపాయలు ఇస్తున్నామన్నారు.

తెలంగాణలో ఉన్న పేదరికాన్ని శాశ్వతంగా తొలగించాలంటే నాణ్యమైన విద్య ఒక్కటే మార్గమని భావించిన గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేనన్ని గురుకులాలు పెట్టి కేజీ టు పీజి ఉచిత విద్య ద్వారా అన్ని వర్గాల పేద బిడ్డలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించడంతో నేడు గురుకుల విద్యార్థులు దేశంలోని గొప్ప, గొప్ప విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో స్థానం సంపాదించి తమ సత్తా చాటుతున్నారని తెలిపారు. గిరిజన గురుకులాల్లో విద్యార్థులకు జాతీయ,అంతర్జాతీయ స్థాయిల్లోని ఉత్తమ విశ్వవిద్యాలయాలు, ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు సాధించడం కోసం ప్రభుత్వం క్యాట్, జీఆర్ఈ, టోఫెల్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తోందని తెలిపారు. ప్రభుత్వ గిరిజన గురుకుల విద్యా సంస్థల్లో చదివి ఉన్నత విద్య కోసం ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు అక్కడ చదివే ఆర్ధిక స్తోమత ఉండదని ముందే గుర్తించి, వారందరికీ కావల్సిన ఆర్ధికసాయం చేయాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నదన్నారు. ఇందులో భాగంగా ఐఐటీలో సీట్లు సాధించిన విద్యార్థులకు 50వేల రూపాయలు, ల్యాప్ టాప్ అందిస్తున్నామన్నారు. ఎన్.ఐ.టి/ఐఐఐటి సంస్థల్లో సీటు సాధించిన వారికి 40వేల రూపాయలు, ల్యాప్ టాప్ ఇస్తున్నామని, ఎంబీబీఎస్ లో సీటు సాధించిన విద్యార్థులకు 50వేల రూపాయలు, బిడిఎస్ లో అడ్మిషన్ పొందిన వారికి 40వేల రూపాయలను ప్రోత్సాహకంగా ఇస్తున్నామని చెప్పారు.

2015 నుంచి 2020 వరకు ఐఐటీల్లో 183 మంది, ఎన్ఐటీలో 200 మంది, ఐఐఐటిలో 59 మంది, ఎంబీబీఎస్ లో 67 మంది, బిడిఎస్ లో ముగ్గురు విద్యార్థులకు ఈ ప్రోత్సాహకాలు అందించామన్నారు. కరోనా వల్ల విద్యాలయాలు మూతపడి ఉన్నప్పటికీ గురుకుల విద్యార్థులు ఈ సంవత్సరం కూడా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు సాధించారని, వారికి కూడా ఈ ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.

ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు పొందిన విద్యార్థులు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి(డిటిడిఓ) లకు తమ వివరాలు అందజేయాలని, తెలంగాణ ఈపాస్ వెబ్ సైట్ https://telanganaepass.cgg.gov.in లో తమ వివరాలు నమోదు చేసుకుంటే వారికి ఉపకారవేతనాలు కూడా అందుతాయని