” “వైట్ కాలర్ నేరస్థుడు” పై పీడీ యాక్ట్ అమలు

రాయల్ పోస్ట్ న్యూస్ రామగుండం :రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో నీతి, నిజాయితీ లేకుండా నిరుద్యోగ యువత మరియు సింగరేణి కంపెనీలో పనిచేస్తున్న సింగరేణి ఉద్యోగుల పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగాలు పెట్టిస్తానని అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి వరుస నేరములకు పాల్పడుతున్నా

మారగోని శ్రీనివాస్ గౌడ్, తండ్రి : యాదగిరి, వయస్సు: 42 సం.లు., కులము: గౌడ్, వృత్తి: రియల్ ఎస్టేట్ బిజినెస్, స్వస్థలము: నాగేపల్లి గ్రామము, రామగిరి మండలము, పెద్దపల్లి జిల్లా, ప్రస్తుత నివాసము: ప్లాట్ నెం.65, మమతనగర్, నాగోల్, హైదరాబాద్, అనబడే “వైట్ కాలర్ నేరస్థుడు” పై పీడీ యాక్ట్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్.,గారు. సీపీ గారి ఉత్తర్వులను మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్, సీసీసీ నస్పూర్ ఎస్ఐ శ్రీనివాస్ నిర్బంధ పీడీ యాక్ట్ ఉత్తర్వులను చర్లపల్లి కేంద్ర కారాగారం లో అధికారుల సమక్షంలో అందచేసి చేయడం జరిగింది.

నిందితుని నేర విధానం,నేర నేపథ్యం:
నిందితుడు ఒక అలవాటుపడిన “వైట్ కాలర్ నేరస్థుడు”, అతను రామగుండం కమీషనరేట్ లో చాలా మంది నిరుద్యోగులు మరియు ప్రైవేటు ఉద్యోగులకు సింగరేణి కంపెనీలో ఉద్యోగాలు పెట్టిస్తానని నమ్మించి, వారి వద్ద నుండి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేయటం మరియు బెదిరించడం వంటి నేరాలకు పాల్పడినాడు .మరియు (26) మంది బాధితులనుండి సుమారు 1.6 కోట్ల రూపాయలు వసూలు చేసినాడు. తద్వారా నిరుద్యోగ యువత, ప్రైవేటు ఉద్యోగులు మరియు సాధారణ ప్రజల మనస్సులలో భయాందోళనలు సృష్టిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించుచున్నాడు. అతని చర్యలు ప్రజా జీవనంపై ప్రతికూల ప్రభావం కలిగించుచున్నాయి. ఇప్పటివరకు నిందితుడు సీసీసీ నస్పూర్, మంచిర్యాల, మందమర్రి, గోదావరిఖని 1టౌన్ మంథని ముత్తారం పోలీస్ స్టేషన్ పరిదిలలో (06) నేరములలో పాలుపంచుకున్నాడు.ఈ విధముగా వరుసబెట్టి మోస పూరితమైనటువంటి కార్యకలాపాలలో పాల్పంచుకుని అక్కడి ప్రాంతంలో నివసించే సాధారణ ప్రజల మనస్సులలో తీవ్ర భయాందోళనలు సృష్టించావు తద్వారా చట్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే కాకుండా సామాజిక శాంతి సామరస్యతలకు భంగం కలిగించాడు. నిందితుని చర్యలు చట్టానికి విరుద్ధంగా ఉండి, రామగుండం కమిషనరేట్ పరిధిలో ప్రజాశాంతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు.

ఉద్యోగాలు పెట్టిస్తానని అధిక మొత్తంలో డబ్బులు వసూలు పాల్పడుతున్నా నిందితుని పై పీడీ యాక్ట్ అమలుకు కృషి చేసిన మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ ఐపీఎస్,మంచిర్యాల రూరల్ ఇన్స్పెక్టర్ సంజీవ్, సీసీసీ నస్పూర్ ఎస్ఐ శ్రీనివాస్ లను సిపి గారు అభినదించారు.