రాయల్ పోస్ట్ న్యూస్ మహబూబాబాద్ :
హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై బయటకు వస్తే కఠినచర్యలు తప్పవు.-
నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ చేయబడతాయి
డిసెంబర్ 5వ తేదీ నుండి అమలు.
హెల్మెట్ ,నెంబర్ ప్లేట్ లేని వాహనదారులు డిసెంబర్ 5 లోపు ఏర్పాటు చేసుకోవాలి.
లేనియెడల కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎన్.కోటిరెడ్డి గారు స్పష్టం చేశారు.

మహబూబాబాద్ జిల్లా లో ఇకపై ట్రాఫిక్ నియమనిబంధనలు కఠినంగా అమలు చేయబడుతాయని, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై జరిమానా తప్పదని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ తెలిపారు.

హెల్మెట్ లేకుండా మరియు నాణ్యతలేని హెల్మెట్ ధరించి వాహనాలను నడపడం లాంటి ట్రాఫిక్ నియబంధనలను ఉల్లఘించిన వాహనదారులపై కఠినంగా వ్యవహరించడంతో పాటు వారిపై జరిమానాలు విధించబడుతాయని ఎస్పీ తెలియజేసారు. నంబర్ ప్లేట్ లేకుండా రోడ్లపై నడిపే వాహనాలను నిలిపివేయడంతో పాటు వాహనదారుడిపై జరిమానా విధించబడుతుందని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి గారు తెలిపారు.