రాయల్ పోస్ట్ న్యూస్ రంగారెడ్డి జిల్లా, మంచాలా,రైతులు పండించిన పంటను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మంచాల జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి. మంచాల మండలం బోడకొండ లో ఈ రోజు రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ZPTC, అనంతరం మాట్లాడుతూ ఫోన్ నెంబర్ కు ఆధార్ లింకు కాకపోవడంతో రైతులకు తలనొప్పిగా మారిందని తెలిపారు ,దీంతో ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్న రైతులు, ధాన్యం చెల్లింపులో జాప్యం ధాన్యం కొనుగోలు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంతో రైతులకు ఇబ్బంది ఏర్పడిందన్నారు, చాలా మంది రైతులు ఆధార్ కు ఫోన్ నెంబర్ లింక్ కాకపోవడంతో OTP రావడం లేదని అన్నారు,ట్రాక్ షీట్ లోని తూకం వివరాలను టాబ్ లో ఎంట్రీ చేయడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి ,దీంతో ఆన్లైన్ నమోదు లో ఆలస్యం అవుతుంది, రైతులకు ధాన్యం డబ్బు చెల్లింపులో తీవ్ర జాప్యం నెలకొంటుంది, ఆధార్ లింక్ కోసం రైతులు మీసేవ, ఆధార్ కేంద్రాలు, పోస్టాఫీసులు తిరుగుతున్నారు, అధికారులు వెంటనే స్పందించి రైతులను అయోమయానికి గురి కాకుండా చూడాలని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో రైతులు,మరియు ఆంబోతు తండా ఎంపిటిసి రాందాస్ నాయక్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కొర్ర పాండు,లచ్చిరం,సీతారాం,బలరాం తదితరులు పాల్గొన్నారు.