రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి :భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రచించిన రాజ్యాంగం ను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు…

స్థానిక
జిల్లా కేంద్రంలో ని దళిత సంఘాల ఆధ్వర్యంలో 72 వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది
ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, PMC రాష్ట్ర కార్యదర్శి సిర్పంగా శివలింగం వారు మాట్లాడుతూ రాజ్యాంగం డే (IAST: samvidhana .divasa) గా కూడా పిలిచే నేషనల్ లా డే జరుపుకొంటారు. భారత రాజ్యాంగం స్వీకరణ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారతదేశం యొక్క రాజ్యాంగం 26 నవంబర్ 1949 న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగన్ని ఆమోదించింది మరియు ఇది జనవరి 26న అమల్లోకి వచ్చింది వారు అన్నారు. ప్రపంచ దేశాలు సైతం ఆదర్శంగా నిలిచి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని మూడు సంవత్సరాల పాటు భారత దేశ భవిష్యత్తు కోసం తన మేధస్సును ధార పోసిన భారత రాజ్యాంగ కోసం నిర్మించిన మహా వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు . భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కుల మత జాతి వర్గ వివక్షత లేకుండా ప్రతి పౌరుని సామాజిక రాజకీయ ఆర్థిక సమన్వయం అందించడమే భారత రాజ్యాంగ లక్ష్యమన్నారు.
ఈ కార్యక్రమంలో బట్టు రామచంద్రయ్య MSF జిల్లా కో ఆర్డినేటర్ ఇటుకల దేవేందర్ మాదిగ, డాకురి ప్రకాష్, బర్రె సుదర్శన్, ముత్యాల జలందర్, కోడారి వెంకటేష్, కొల్లూరి హరీష్ మాదిగ, మటూరి అశోక్, మెరుగుమల్ల ఆనంద్, అందే నరేష్, గ్యాస్ చిన్న, దర్గాయి దేవేందర్, బట్టు మహేందర్,ఇంజ నరేష్, సురేష్, మధు, దినేష్, బర్రె దాస్ తదితరులు పాల్గొన్నారు