రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి :భారత రాజ్యాంగం దేశం లోని ప్రతి పౌరునికి జీవించడానికి సమాన హక్కులు కల్పించిందని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

నవంబర్ 26 వ తేదీ శుక్రవారం నాడు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆయన భారత రాజ్యాంగం పీఠిక చదివి ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలో 1948 సంవత్సరం, నవంబరు 26 నుండి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని, ప్రతి పౌరునికి జీవించడానికి సమాన హక్కులు కల్పించడమే ప్రధాన ఉద్దేశం అని అన్నారు. రాజ్యాంగం లోని అన్ని విషయాల మూల తత్వం రాజ్యాంగ పీఠిక ద్వారా తెలుసుకోవచ్చునని అన్నారు. రాజ్యాంగ విలువలను ప్రోత్సహించడానికి దేశంలో యువతకు అవగాహన కల్పించడంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ముఖ్య పాత్ర పోషించారని అన్నారు.

కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ్ కుమారి, కలెక్టరేటు విభాగం లోని సూపరింటెండెంట్లు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.