రాయల్ పోస్ట్ న్యూస్ ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి జిల్లా,: ఇబ్రహీంపట్నం లో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చిక్కుడు గుండాలు ఆధ్యర్యం లో అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిక్కుడు గుండాలు మాట్లాడుతూ మాట్లాడుతూ.. దళితులపై ఎమ్మెల్యేకు ఏ మాత్రం గౌరవం ఉన్నా మార్కెట్ కమిటి చైర్మెన్ పదవిని భర్తీ చేయాలని అన్నారు. మార్కెట్ కమిటి చైర్మెన్ పదవిని అధిష్టించడానికి అర్హత కలిగన దళితులకు ఇవ్వడానికి జాప్యం వహించడంలో అర్ధం ఏమిటి అని ప్రశ్నించారు. ఈ పదవి విషయంలో ఎన్నో రోజుల నుంచి కాలయాపన చేస్తున్న ఎమ్మెల్యే వ్యవహార శైలి ప్రజలకు అర్ధం కావడం లేదన్నారు. దళితులపై ప్రభుత్వానికి నమ్మకం ఉండాలంటే చైర్మెన్ పదవిని వెంటనే దళితులకు ఇవ్వాలని దళితులను చిన్నచూపు చూసిన ఏ ప్రభుత్వాలు మనుగడ కొనసాగించలేదని అలాంటి ప్రభుత్వాలు కాల గర్భంలో కలసిపోక తప్పలేదని అన్నారు. ఇప్పటికైనా స్తానిక ఎమ్మెల్యే మార్కెట్ కమిటి చైర్మెన్ పదవిని అర్హత కలిగిన దళిత నాయకునికి కట్టబెట్టాలని డిమాండ్ చేసారు. అలా కాని క్రమంలో దళిత సంఘాల అద్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు మాజీ మండల అధ్యక్షుడు బోసుపల్లి వీరేశ్ కుమార్, ఎస్ఎఫ్ఐ నాయకులు విప్లయ్ కుమార్, కొత్తపల్లి ఉపసర్పంచ్ కావలి జగన్,బాలయ్య, రనీ, లక్ష్మయ్య, తలారి సత్యనారాయణ, రవిందర్, యాదగిరి కృష్ణ, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు