రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి: 72 వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శ్రీమతి మాటూరి యశోధర తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణ సమితి పార్టీ వ్యవస్థాపకురాలు భువనగిరి పట్టణంలో నీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించడం వలన మన దేశ జనాభాలో అణగారిన కులాలకు విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధిలో కొన్ని అవకాశాలు లభించాయని జనాభాలో ఇప్పటికీ చట్టసభల లోనికి చాలా కులాలు అవకాశం లేకుండా పోయిందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కలలు నెరవేరేవరకు బడుగు బలహీనవర్గాల సంఘటితంగా పోరాడాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కరెన్సీ నోట్ల పైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలని జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని దేశవ్యాప్తంగా కుల గణాంకాలను లెక్కించాలని ఆమె డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో లో మల్లె పోయిన వంశీకృష్ణ కిరణ్ మాటూరు అఖిల్ కిరణ్ వెంకటేష్ శంకర్ సోములు మొదలగు వారు పాల్గొన్నారు.