కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని జేరిపోతుల పరశురామ్ జ్ఞాన యుద్ధ యాత్ర

భారత రాజ్యాంగ నిర్మాత, ఆర్బిఐ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని కరెన్సీ నోట్లపై గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పెట్టాలని
కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేరిపోతుల పరుశురామ్ పల్లె నుండి ఢిల్లీ వరకు జ్ఞాన యుద్ధ యాత్ర యాదాద్రి భువనగిరి జిల్లా అంబేద్కర్ విగ్రహం వద్దా బహుజన యుద్ధనౌక వైయస్సార్ టిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న ప్రారంభించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ లేకుంటే భారత రాజ్యాంగం లేదు భారత రాజ్యాంగం లేకుంటే ఈ రాజ్యం ఏ లేదు అలాంటి మహానుభావుని ఈ ప్రభుత్వాలు తన చరిత్రను మరిచిపోతుంది అందుకోసమే ఈ న్యాయబద్ధమైన పోరాటానికి మనమందరం సిద్ధం కావాల్సిన అవసరం ఆసన్నమైందని అన్నారు
కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరుశురామ్ మాట్లాడుతూ ఇంపీరియల్ బ్యాంకు 1921లో కుప్పకూలిన పడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు సగటు మనిషి వ్యక్తి కోణంలో నుండి ఆర్థిక కోణాన్ని దృష్టిలో ఉంచుకొని రూపాయి దండ సమస్య పరిష్కార మార్గం అనే పుస్తకాన్ని 1923 లో వ్రాసి బ్రిటిష్ ప్రభుత్వానికి ఇతని యంగు కమిషన్ కి రాయల్ కమిషన్ కు ఇవ్వడం వల్ల సైమన్ కమిషన్ ఇది వాస్తవం అని చెప్పి 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐ ఏర్పడింది అంటే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వల్ల అందుకే భారత రాజ్యాంగాన్ని రాసారు కాబట్టి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలి,ఆర్బిఐ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాబట్టికరెన్సీ నోట్లపై ముద్రించాలని ఆర్బిఐ ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం
ప్రధానంగా అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సీసీ కెమెరాలు హైమాక్స్ లైట్స్ ఏర్పాటు చేసి అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలి
నూతనంగా నిర్మించే పార్లమెంటు భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయాలి ముఖ ద్వారం వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాన్ని నిర్మిస్తోంది దీనికి అంబేద్కర్ పేరు పెట్టాలి ముఖ ద్వారం వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలి ఈ యొక్క 5 డిమాండ్ల సాధనకై పల్లె నుండి ఢిల్లీ వరకు జ్ఞాన యుద్ధం యాత్ర చేస్తున్నామని జేరిపోతుల పరుశురామ్ అన్నారు
ఈ యొక్క సభకు కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్ సభాధ్యక్షత వహించగా కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జాంగిర్ CAPSS గౌరవ అధ్యక్షులు బట్టు రాంచంద్రయ్య CAPSS జాతీయ ఉపాధ్యాయలు బొల్లి స్వామి MSF జిల్లా అధ్యక్షులు దేవేందర్ సుర్పంగా శివలింగం *మాటూరి యశోధర,మాటూరి అశోక్, బర్రె సుదర్శన్ నల్ల కృష్ణ *అందె నరేష్* తదితరులు పాల్గొన్నారు