రాయల్ పోస్ట్ న్యూస్ మహబుబాబాద్ :ఆర్టీసీ అభివృద్ధికి అధికారులు సంయుక్తంగా సమన్వయంతో పనిచేయాలని ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ప్రగతి సమావేశ మందిరంలో జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశం ఏర్పాటు చేసి ఆర్టీసీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఆర్టీసీని లాభాల బాటలో పయ నింప చేసేందుకు చేపట్టవలసిన పలు అంశాలను అధికారులు సమీక్షిస్తూ ప్రైవేటు వాహనాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని పోలీస్ శాఖ సహకారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు ప్రజలు కోరిన రోడ్లకు సర్వీసులు నడిపే విధంగా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి అని ప్రతి గ్రామ పంచాయతీకి బస్సులు నడిపే విధంగా కృషి చేయాలన్నారు.
మున్సిపాలిటీల పరిధిలో ఉన్న డిపోల పరిశుభ్రత కొరకు మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలన్నారు ప్రైవేట్ వాహనాల పత్రాలను పరిశీలిస్తూ ఉండాలని అనుమతి లేని వాహనాలను సీజ్ చేయాలన్నారు అదేవిధంగా ప్రయాణికులు నిబంధనల మేరకే ఉండాలని లేనిచో జరిమానా విధించారు అలాగే ద్విచక్రవాహనాలపై ముగ్గురు ప్రయాణించిన జరిమానా విధించాలని అన్నారు కళాశాల విద్యార్థుల కొరకు ఆయా సమయాలలోనే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలన్నారు.

ఈ టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ పోలీసు అధికారులు ఆర్టీసీ ఆర్ఎం విజయ భాస్కర్ తొర్రూరు మహబూబాబాద్ డిపో మేనేజర్లు రమేషు రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.