రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి :శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆటో యూనియన్ (AITUC అనుబంధం) భువనగిరి టూ ఘట్కేసర్ రూట్ ఆధ్వర్యంలో రూ.5000/- ఆర్ధిక సహాయం అందించారు.
భువనగిరి పట్టణం 11వ వార్డ్ బొమ్మయిపల్లికి చెందిన నిమ్మల నరసింహ(55) ఈ నెల 17వ తేదీన ఆకస్మిక మృతి చెందారు.ఈ రోజు గురువారం నర్సింహా కుమారుడు నిమ్మల నవీన్ కు రూ.5000/- అందచేశారు. ఈ సందర్బంగా MD.ఇమ్రాన్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన నరసింహ సొంతంగా ఆటో కొనుకొని స్వయం ఉపాధిపై జీవిస్తున్న నర్సింహా ఆకస్మిక మృతితో వారి కుటుంబం రోడ్డు పాలయిందని,ఆకస్మిక మృతి చెందిన నర్సింహా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల కోసం సమగ్ర సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కారిక్రమంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు గానబోయిన వెంకటేష్ (రాణా), నాయకులు కురం పోచలు, బాబు, అశోక్,రమేష్, రాజు, వెంకటేష్, ఐలయ్య, రాములు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.