రాయల్ పోస్ట్ న్యూస్ మహబూబాబాద్: స్టేషన్ పరిధిలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలతో వచ్చే ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలందించాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి గారు ఆదేశించారు.

మరిపెడ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ లో భాగంగా మొదటగా పోలీస్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది వివరాలను అడిగితెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది యూనిఫామ్ ,నీట్ టర్న్ ఔట్ పరిశీలించారు.
అనంతరం సిబ్బంది యొక్క పరేడ్ వీక్షించారు.క్రమశిక్షణతోనే మంచి వ్యక్తిత్వం అలవారుతుంది అని అన్నారు.
స్టేషన్ లోని గదులను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. స్టేషన్ లలో అమలు అవుతున్న స్ఎస్ సిస్టం, 17 వర్టికల్స్ గురించి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ లో ఎక్కువగా నమోదవుతున్న కేసులపై అడిగి తెలుసుకున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా స్టేషన్ ఆవరణలో నాటిన మొక్కలను పరిశీలించారు. వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిసరాలు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలని అన్నారు. చోరీలు జరగకుండా పకడ్బంది నిఘా ఏర్పాటు చేయాలని, సిబ్బందిని పెంచి ముమ్మరంగా పెట్రోలింగ్ చేపట్టాలని ఆయన పోలీస్ అధికారులను ఆదేశించారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.