స్టాఫ్ రిపోర్టర్ : ఎస్ కె. సుభాన్ పాషా రాయల్ పోస్ట్ న్యూస్ బెల్లంపల్లి

బెల్లంపెల్లి ఏరియా హాస్పిటల్ లో పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి..

రంగ ప్రశాంత్ -అధ్యక్షులు AITUC సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ , బెల్లంపెల్లి బ్రాంచ్

మాట్లాడుతూ, గత 3 సంవత్సరాల నుండి చాలి చాలని వేతనాలు తీసుకుంటూ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు యధావిధిగా కొనసాగించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు,,కరోన సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసిన స్టాఫ్ నర్సులు,ల్యాబ్ టెక్నీషియన్,వార్డ్ బాయ్స్ లతో పాటు ఇతర కార్మికులు యధావిధిగా కొనసాగించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు,కాంట్రక్టు (ఒప్పందం) వచ్చిన తరువాత కూడా యాజమాన్యం గత 2నెలల నుండి వీరిని విధుల్లోకి తీసుకోకపోవడం పట్ల కార్మికులు వారి కుటుంబాలు పస్తులు ఉంటున్నారని,చాలా ఆందోళన చెందుతున్నారని అన్నారు,ఉద్యోగంలోకి తీసుకోక పోవడంతో కార్మికులు వారి కుటుంబాన్ని పోషించుకోలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,యాజమాన్యం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేనిపక్షంలో వారి కుటుంబాలు రోడ్డు మీద పడే అవకాశం ఉందని అన్నారు,పాతవారినే ఉద్యోగంలోకి తీసుకోవాలని లేనిపక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు.