రాయల్ పోస్ట్ న్యూస్ సూర్యాపేట: జిల్లా కేంద్రంలో ని కుడ కుడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా పేస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్ధిక అక్షరాస్యత కేంద్రం ను ప్రారంభించారు. భారతీయ రిజర్వు బ్యాంక్ వారి సహకారం తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యం తో ప్రారంభించిన ఈ కేంద్రాన్ని పేస్ స్వచ్ఛంద సంస్థ నిర్వహించనున్నది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ రిజర్వు బ్యాంక్ ఏ జి ఎమ్ రాజేంద్ర ప్రసాద్,లీడ్ బ్యాంక్ మేనేజర్ జగదీష్ చంద్ర బోస్ లు కలసి ప్రారంభించిన కార్యక్రమంలో ఏ జి ఎమ్ మాట్లాడుతూ ఈ డిజిటల్ యుగంలో ప్రజలు ఆర్ధిక అక్షరాస్యత ను తప్పని సరిగా మెరుగుపరచుకోవాలని లేకపోతే మోసపోయి అవకాశం ఉందని గ్రహించాలాని ఆర్ధిక అక్షరాస్యత తో పాటు ఇతర న్యాయ పరమైన అక్షరాస్యత లో అందరు మెరుగుపరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ రామ కృష్ణ, పేస్ స్వచ్ఛంద సంస్థ ఏరియా కో-ఆర్డినేటర్ బత్తుల గణేష్, క్లస్టర్ కో-ఆర్డినేటర్ మౌనిక , సిఎస్పి ఇందిరా తదితరులు పాల్గొన్నారు.