రాయల్ పోస్ట్ న్యూస్ నిజామాబాద్ జిల్లా: సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో కళ్ళు డిపో కాలనీ వద్ద సి. సి రోడ్డు నిర్మాణ పనులు నాణ్యత లోపం కొట్టొచ్చినట్టు అర్థ పీట్ ఇసుకపై పోస్తున్న సిసి రోడ్డు భారీ వర్షానికి కొట్టుకు పోయేలా ఉంది. కంకర తో కూడిన మెటల్ పోసి రోడ్డు రోలర్ తో తొక్కించి నా తర్వాత సిమెంటు రోడ్డు వేయాలని కాలనీవాసులు గ్రామ ప్రజలు కోరుతున్నారు. గ్రామ సర్పంచ్ కి ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని కాంట్రాక్టర్ను నిలదీయగా దిక్కున్న చోట చెప్పుకోమాని అంటున్నాడు. అధికారులకు విన్నవించుకున్నా అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. నాణ్యత లోపించిన సి.సి రోడ్డును నిర్మిస్తే మూడునాళ్ళ ముచ్చటగా అవుతుందని భారీ వర్షానికి కొట్టుకుపోతుందని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవద్దని కాలనీవాసులు గ్రామ ప్రజలు అన్నారు. నాణ్యతతో కూడిన సి. సి రోడ్డు ను నిర్మించాలని కాలనీవాసులు గ్రామ ప్రజలు అంటున్నారు.