స్టాఫ్ రిపోర్టర్ యస్ కే సుభాన్ పాషా రాయల్ పోస్ట్ న్యూస్ కొమరం భీమ్ కాగజ్ నగర్ :తాజ్ బాబా సేవాసమితి అధ్వర్యంలో కాగాజ్ నగర్ సీఐ రానాప్రతాప్, ఎస్ ఐ సత్తార్ గారి సహకారంతో కాగజ్ నగర్ డివిజన్ లోని కొలాం గోంది కుగ్రామంలో నివసిస్తున్న పదిహేను కుటుంబాలకు బియ్యం,నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యతిధిగా సీపీఐ (ml) న్యూడెమోక్రసీ కుమ్రం భీమ్ జిల్లా కార్యదర్శి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాజ్ బాబా సేవాసమితి వ్యవస్థాపకులు ఉస్మాన్ పాషా గత రెండు సంవత్సరాల క్రితం నుంచి ఇలాంటి కార్యక్రమాలు ఆదివాసీ ప్రాంతాల్లో,దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అతనికి ప్రభుత్వం తరుపున ఒక వాహనాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే ఇలాంటి వాళ్ళకు సహాయం చేయడానికి పెద్ద ఎత్తున దాతలు సహకారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాజ్ బాబా సేవాసమితి సభ్యులు సలీం ,రసూల్ షరీఫ్, హాజి బాబా, శ్రినులాల్,కుషనపెల్లి శంకర్,చరణ్ తదితరులు పాల్గొన్నారు.