రాయల్ పోస్ట్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్ కె.సుభాన్ పాషా

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం కల్వరి ప్రార్ధన మందిరం ప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కల్వరి చర్చ్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర, దేశ ప్రజలందరూ కరోనా విపత్తు నుండి త్వరగా బయటపడాలని అదేవిదంగా ఆ దేవుని ఆశీస్సులు ప్రజలందరి పై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య మరియు మంచిర్యాల్ ఎమ్మెల్యే దివాకర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు ప్రార్ధన మందిర ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో దైవజనులు ఎలీషా పాల్, డేవిడ్ పాల్,స్టీవెన్ సన్, అబ్రహం ప్రభాకర్ జెర్మియా తదితరులు పాల్గొన్నారు.