రాయల్ పోస్ట్ న్యూస్ నల్గొండ :అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయడం ఆలోచనను విరమించుకోవాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
గురువారం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ముందు ధర్నా చేసి *సి డి పి ఓ *టీ నిర్మల* కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి టీచర్లకు పి ఆర్ సి ప్రకారం పెంచిన వేతనాలను వెంటనే విడుదల చేసి వారికి అందించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక విద్య పాఠశాలలో విలీనం చేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేసే చర్యలను ఆపాలన్నారు అంగన్వాడీలను ప్రాథమిక విద్య పాఠశాలలో విలీనం చేయడం వల్ల గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారం అందగా తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని ఆమె అన్నారు అంగన్వాడీ టీచర్ ల ను ఇతర శాఖల పనులు అప్పగించడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నేటికీ అక్టోబర్ నెల వేతనం రాలేదని ప్రతి నెల 5వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సెంటర్ అద్దెలు, గ్యాస్ బిల్లులు కంటింజెన్సీ నిధులు సకాలంలో ఇవ్వడం లేదని అప్పులు తెచ్చి వండి పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, భీమ గాని గణేష్, ప్రకృతాoబ, లక్ష్మి రత్న విజయలక్ష్మి వెంకట నరసమ్మ విజయ రాణి అరుంధతి పద్మావతి పల్లవి నశ్రీన్ సుభాషిణి మంగమ్మ పద్మ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు