రాయల్ పోస్ట్ న్యూస్ షాద్ నగర్ :వైయస్సార్ సిద్ధాంతాలే తిరిగి పార్టీలో చేరికకు ప్రధాన కారణం… బ్రదర్ అనిల్ కుమార్ పిలుపుతో తిరిగి వై ఎస్ ఆర్ టి పి పార్టీలో చేరిన ఎండి ఇబ్రహీంరాయల్
షాద్ నగర్ పట్టణంలో ప్రముఖ వ్యాపారవేత్తగా సమాజ సేవే పరమావధిగా ప్రజల శ్రేయస్సు కోసం అనునిత్యం పాటుపడుతూ కృషి చేస్తున్న యువ నాయకుడు ఎండి ఇబ్రహీం తిరిగి వైయస్సార్ టిపి పార్టీ లో చేరుతున్నట్లు ప్రకటించడం కార్యకర్తలకు ఆనందాన్ని తెచ్చి పెట్టింది దివంగత నేత వైఎస్సార్ ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీలు ఇదివరకు ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించిన సభలు సమావేశాలు విజయవంతం చేసిన ఇబ్రహీం వ్యక్తిగత కారణాలు తో పార్టీకి రాజీనామా చేసిన అతి స్వల్ప కాలంలోనే ఆయన చేసిన సేవలు ఆయన ప్రస్తుతం పార్టీలో లేకపోవడంతో తిరిగి ఎండి ఇబ్రహీం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి అండదండగా నిలుస్తామని భరోసా ఇచ్చినట్లు ఆయన మీడియాకు బులిటెన్ విడుదల చేశారు తన తండ్రి వైఎస్ఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తిరిగి ఆయన ఆశయ సాధన కోసం పని చేయాలంటే వైయస్ఆర్సిపి పార్టీని ముఖ్యమని భావించి పార్టీ అధిష్ఠానం సూచనతో మరోసారి తిరిగి పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు