రాయల్ పోస్ట్ న్యూస్ నిజామాబాద్ జిల్లా: భీంగల్ మండలంలోని బెజ్జోర కొనుగోలు కేంద్రంలో కడ్త విషయమై మంగళవారం నాడు జరిగిన రైతుల ధర్నా తెలుసుకున్న నిజామాబాద్ జిల్లా సహకార అధికారి సింహాచలం బెజ్జోర కొనుగోలు కేంద్రాన్ని బుధవారం నాడు సందర్శించి సెంటర్లో జరుగుతున్న విషయాల పై విచారణ చేశారు. కడ్తా లేకుండా తీసుకోవాలంటే చెన్ని పట్టి తీసుకురావాలని రైతులకు సూచించారు. ఎఫ్ ఏ క్యు ఉన్న ధాన్యాన్ని కడ్తా పేరుతో రైస్ మిల్లర్లు దించుకోకపోతే డి సి ఓ లేదా డి ఎస్ ఓ లకు సంబంధిత తహసీల్దార్లకు తెలిసినట్లయితే రైస్ మిల్లు పై తక్షణ చర్యలు తీసుకొనుట వెనుకాడబోమని డి సి వో తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో ఆలస్యం జరగకుండా ప్రతిరోజు నాలుగు కాంటాలతో కొనుగోలు చేసి ఆదివారం నాటి కల్లా పూర్తి అయ్యేలా చూడాలని భీంగల్ ఎఫ్ ఎస్ సి ఎస్ సీఈవో అశోక్ గౌడ్ కు సూచించారు. రైతులకు ఇబ్బంది కలిగించే టోకెన్ విషయంలో క్రమం తప్పకుండా నిష్పక్షపాతంగా కొనుగోలు నిర్వహించాలని, అలాగే రైతుల సమక్షంలోనే తూకం నిర్వహించాలని, ఏ రోజుకు ఎన్ని బస్తాలు కొనుగోలు చేసామో, ఎన్ని లోడ్ లు రైస్ మిల్ కు పంపామో ప్రతిరోజు సమాచారం ఇవ్వాలని, గన్ని బస్తాల కొరత, లారీల ట్రాన్స్ పోర్ట్ సమస్య ఉంటే అధికారుల దృష్టికి తేవాలని సొసైటీల సీఈఓ లు అశోక్ గౌడ్, క్రాంతి కుమార్ ముచ్కూర్ సొసైటీలకు తెలిపారు. డి సి ఓ గారి వెంట భీంగల్ తాసిల్దార్ రాజేందర్, ఆడిటర్ సురేష్, రైతు సేవా సహకార సంఘం చైర్మన్ శివ సారి నరసయ్య, డైరెక్టర్ సూల్ల రాజు, సర్పంచ్ కోగూర్ ప్రతిభా సుమన్, వీడీసీ అధ్యక్షుడు జంగిటి లక్ష్మణ్ లు ఉన్నారు.