పోడు భూముల రైతులకు పట్టాలు వెంటనే ఇవ్వాలి
లేని పక్షంలో ఉద్యమం తప్పదు

పారెస్టు భూములను హరితహారం పేరుతో కొత్త పసుబుక్స్ ఇవ్వకపోవడం అన్యాయం

వరి ధాన్యాన్ని కొనుగోలు పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆపాలి

వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి….

సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య ….

రాయల్ పోస్ట్ న్యూస్ సంగారెడ్డి : సంగారెడ్డి లోని కేవల్ కిషన్ భవన్ లో జరిగిన సిపిఎం సంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశనికి ముఖ్య అతిథులుగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కరాములు హాజరైనారు.
ఈ సందర్బంగా
ఎస్ వీరయ్య మాట్లాడుతూ పోడు భూముల సమస్య ను నిర్లక్ష్యం చేయకుండా మూడు రైతులకు పట్టాలు వెంటనే ఇవ్వాలని లేనిపక్షంలో ఉద్యమం తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడంతో రోడ్ల దిగ్బంధం ప్రభుత్వం దిగివచ్చి సమస్యను పరిష్కరిస్తామని చెప్పిందని ఆచరణలో కుంటి సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో అనేక సంవత్సరాలు గా భూములకు పట్టా దార్ పస్సుబుక్స్ ఉండి, రికార్డులు అన్ని ఉన్న కూడా పారెస్టు భూములని కొత్త పాస్ బుక్స్ ఇవ్వకుండా రైతులను తీవ్రంగా ఆర్థిక ఇబందులకు, మానసిక వేధింపులకు ప్రభుత్వం గురిచేస్తుంది. ఈ రైతులకు రైతు బంధు ఇవ్వడం లేదు, బ్యాంకులు లోన్లు ఇవ్వడం, రైతు బీమా లేదు ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలి కొత్త పాస్ బుక్స్ ఇవ్వడానికి అని ప్రశ్నించారు. రైతుల సహనాన్ని పరిక్షిస్తే తీవ్ర పోరాటాలు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వాని హెచ్చరించారు. వెంటనే పాస్ బుక్స్ ఇవ్వాలని డిమాండ్ చేసినారు. వరి ధాన్యాన కొనుగోలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు రైతులను మోసం చేస్తున్నాయని అన్నారు డ్రామాలు ఆపి రైతుల వద్ద వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం వారి ధాన్యాన్ని కొనలేనని సర్కులర్ ఇస్తే ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. BJP పార్టీ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ధన్యం కొనుగోలు ఎవరి బాధ్యత? కేంద్రం బాద్యత కదా అని ప్రశ్నించారు.
ప్రజా సమస్యలపై ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తాం
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కరాములు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు
ఈ సమావేశంలో సిపిఎం
జిల్లా కార్యదర్శి బి.మల్లేశం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.జయరాజు,కె.రాజయ్య,అతిమేల మాణిక్ బి.రాంచందర్,జిల్లా కమిటీ సభ్యులు నర్సింహారెడ్డి, పాండురంగ రెడ్డి,జి.సాయిలు, ప్రవీణ్ కుమార్,ఎం.నర్సిములు, యాదవరెడ్డి,ప్రవీణ్ కుమార్,యాదగిరి మహిపాల్ తదితరులు పాల్గొన్నారు…