రాయల్ పోస్ట్ న్యూస్ నల్గొండ :565 జాతీయ రహదారి బైపాస్ ఏర్పాటు చేయాలి సిపిఎం
నల్లగొండ పట్టణ నడిబొడ్డు నుండి 565 జాతీయ రహదారి వెళ్లకుండా బైపాస్ నిర్మాణం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ హాశమ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
బుధవారం సీపీఎం నల్గొండ పట్టణ కమిటీ సమావేశం దొడ్డి కోమరయ్య భవన్ లో జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 565 జాతీయ రహదారి నల్గొండ పట్టణం నుండి వెళ్లడం ద్వారా ముఖ్యమైన వ్యాపార కూడళ్లు ,దేవాలయాలు, మసీదులు, చర్చిలు, పేదల ఇండ్లు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు నష్టపోకుండా పట్టణ శివారు నుండి బై పాస్ నిర్మాణం చేయడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు .జాతీయ రహదారి రావడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వ్యాపారాలు పూర్తిగా నష్టపోవడం జరుగుతుందని అన్నారు. పట్టణంలో ఇండ్లు లేని పేదలందరికీ ప్రభుత్వ హామీ ప్రకారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు కుంభం కృష్ణా రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి ఎండి సలీం, జిల్లా కమిటీ సభ్యులు దండoపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, పట్టణ కమిటీ సభ్యులు పిన్నపరెడ్డి మధుసూదన్ రెడ్డి, గాదె నరసింహ, పాక లింగయ్య, భూతం అరుణకుమారి ,జక్కల రవి కుమార్, పోలే సత్యనారాయణ, గుండాల నరేష్, ఆకిటి లింగమ్మ, తదితరులు పాల్గొన్నారు.