రాయల్ పోస్ట్ న్యూస్ ఓయూ హైదరబాద్ :
నూతనంగా ఎన్నికైన తూటా రాష్ట్ర కార్యవర్గ అభినందన సభను ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ యూనివర్సిటీస్ ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కార్యవర్గనికి నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రో.భీమానాయక్ అధ్యక్షత వహించగా ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు మాజీ లోక్సభ సభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించి విశ్వవిద్యాలయాల లో ఉద్యోగం పొందుతున్న ఆచార్యులు కలిసి తమకు తోచిన విధంగా తండాలు కూడా కొంత సహాయం అందించాలని తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ను స్థాపించారన్నారు. ఈ అసోసియేషన్ తెలంగాణ ఉద్యమ సమయంలో పురుడు పోసుకొని ఈనాటికి జాతి ఉన్నతికి ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు పై గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు విద్యకు దూరం కాకుండా చూడటానికి ప్రయత్నిస్తున్న అందుకు అభినందించారు. నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. నూతన కమిటీ మాట్లాడుతూ రానున్న రోజుల్లో తూటా గిరిజన ప్రజల స్థితిగతులపై సదస్సులను నిర్వహిస్తామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి ప్రొ.శ్రీను నాయక్, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ నరసింహ, డాక్టర్ సుశీల, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ బలరాం, డాక్టర్ చిన్న సైదులు, డాక్టర్ రాజు పాడియా, కోశాధికారిగా డాక్టర్ కే శ్రీనివాస్ నాయక్ లు నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్ ప్రొఫెసర్ చంద్రనాయక్, డాక్టర్ ధనంజయ నాయక్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.