రాయల్ పోస్ట్ న్యూస్ తుర్కపల్లి :మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ఏఐసీసీ మరియు టీపీసీసీ పిలుపు మేరకు రైతులకు మద్దతుగా తుర్కపల్లి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి,వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు వీసం రాజయ్య లు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం నిలువలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కొనుగోలు చేయాలని అదేవిధంగా కొనుగోలు చేసిన ధాన్యం కు డబ్బులను రైతుల అకౌంట్లలో వెంటనే జమ చేయాలని,అకాల వర్షాలకు తడిసిన ధాన్యం నిలువలను ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని,ఇదివరకు ముల్కలపల్లి పిఏసీఎస్ పరిధిలో రైతుల నుండి కొనుగోలుచేసిన ధాన్యం అక్రమాల్లో పల్లెపహాడ్ తరహా భారీ కుంభకోణంలో తుర్కపల్లి,మరియు ముల్కలపల్లికి చెందిన రైతుల అకౌంట్లలో డబ్బులు జమచేయాలని స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా చర్యలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంకా పేద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సేవాదల్ అధ్యక్షుడు తలారి అశోక్, మండల కాంగ్రెస్ నాయకులు,మడిగే వెంకట స్వామి, కోట సురేష్,ఓర్సు భిక్షపతి, బండారి శ్రీనివాస్,గుంటి మల్లేశ్, గడ్డమీది యాదగిరి,భూక్యా రమేశ్ నాయక్,వేముల మల్లేష్,గిద్దె అఖిల్ తదితరులు పాల్గొన్నారు