అరుణ రాయల్ పోస్ట్ న్యూస్ ఆత్మకూర్ భువనగిరి :రాష్ట్ర పోలీసు శాఖ, విద్యా శాఖ, యంగిస్థాన్ మరియు షీ టీం ల సహకారంతో సైబర్ నేరాలు మరియు వాటి నుండి రక్షణపై అవగాహన గురుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సైబర్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ZPHS పల్లెర్ల పాఠశాలలో సైబర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పాఠశాల స్థాయి నుండే సైబర్ నేరాల గురుంచి విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.స్వామి, పల్లెర్ల MPTC ఎస్.మల్లారెడ్డి, ఆత్మకూరు మండల పోలీసు సిబ్బంది మరియు సైబర్ వారియర్స్ రామచంద్రయ్య, ప్రియాంక, పాఠశాల SMC ఛైర్మెన్ వి.స్వామి, పల్లెర్ల గ్రామ పాంచాయతి సెక్రటరీ నరేష్, కారోబర్ స్వామి , సైబర్ కాంగ్రెస్ నోడల్ ఆఫీసర్ ఎం.లక్ష్మణ్, పాఠశాల ఉపాధ్యాయులు MD. షమీమ్, రవీందర్, ఉమా రాణి ,విజయ, సోనీ తదితరులు పాల్గొన్నారు.