రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి: బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు యాదాద్రి భువనగిరి లో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు ఉప్పల జహంగీర్ మాట్లాడుతూ వచ్చేది ఆర్ యెస్ ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం బహుజన్ రాజ్యం అని దొరల గడిల నుండి తెలంగాణ విముక్తి లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందని తెలిపారు. ముఖ్యఅతిథిగా బహుజన సమాజ్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా సీనియర్ నాయకులు బట్టు రామచంద్రయ్య గారు జిల్లా ఇన్చార్జి కొండమడుగు రాజు, గోపి జోన,రవివర్దన్, జిల్లా జనరల్ సెక్రెటరీ కనుకుంట్ల పాండు, అనిల్, మహేందర్, జహంగీర్, శ్రవణ్ రావుల రాజు తదితరులు పాల్గొన్నారు