స్టాఫ్ రిపోర్టర్ : ఎస్ కె. సుభానపాషా రాయల్ పోస్ట్ న్యూస్ మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని బస్తి వద్ద ఏర్పాటు చేస్తున్న నూతన డంపింగ్ యార్డ్ పనులను మరోసారి శాంతిఖని బస్తి 65, 85డీప్ ప్రజలు అడ్డుకున్నారు. మున్సిపల్ కమిషనర్ ఈరోజు నూతన డంపింగ్ యార్డ్ పనులను జేసీబీ సహాయంతో చదును చేయాలని చూడగా ప్రజలు అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ ఈ ప్రదేశంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల మూడు బస్తీల ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రదేశంలో తప్ప వేరే ఏ ప్రదేశంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు తెలిపారు. గతంలో పనులు నిర్వహించేటప్పుడు అడ్డుకున్నామని అయినప్పటికీ మున్సిపల్ కమిషనర్ రజిత మళ్ళీ జేసీబీలతో చదును చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఈ ప్రదేశంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తే ప్రజలందరం కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు