రాయల్ పోస్ట్ న్యూస్ సైదాబాద్ :విద్యా శాఖ అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ అలసత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సైదాబాద్ లోని శంకేశ్వరు బజార్ ప్రభుత్వ పాఠశాలలో మూడు సంవత్సరాలుగా నూతన తరగతి గదుల నిర్మాణం అసంపూర్తిగా మిగిలి పోయింది.దింతో విద్యార్థుల కు తరగతి గదులు లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఒకే గదిలో రెండు.మూడు తరగతులు నిర్వహిస్తున్నారు. నత్త నడక సాగుతున్న పనులపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు పట్టించాకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చెప్పట్టకపోతే మండల ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.