రాయల్ పోస్ట్ న్యూస్సంగారెడ్డి :విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడం మరియు సైబర్ నేరగాళ్ళ చేతిలో మోసపోకుండా మెళకువలు నేర్పడం కోసం పోలీస్ శాఖ మరియు విద్యా శాఖ సమన్వయంతో ప్రారంభించిన సైబర్ కాంగ్రెస్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈరోజు INVESTITURE CEREMONY FOR CYBER AMBASSADORS అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా అడిషనల్ SP శ్రీమతి నితిక పంత్ IPS గారు సదాశివపేట్ లోని గవర్నమెంట్ రవీంద్ర మోడల్ హైస్కూల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ SP గారు మాట్లాడుతూ సైబర్ అంబాసిడర్లు 10 నెలల శిక్షణా కాలంలో నేర్చుకుంటున్న విషయాలను తోటి విద్యార్థులకు, కుటుంబ సభ్యులకు మరియు సమాజంలోని ఇతరులకు నేర్పుతూ, సైబర్ నేరగాళ్ళ బారిన ఎవరూ పడి మోసపోకుండా మెలకువలు నేర్పడం ఈ కార్యకమం ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు. ఇందులో భాగంగా గవర్నమెంట్ రవీంద్ర మోడల్ హైస్కూల్ లో ఎంపిక చేయబడిన ఇద్దరు సైబర్ అంబాసిడర్లకు బ్యాడ్జ్ లను అందచేయడం జరిగింది. ఈ బ్యాడ్జ్ ల ద్వారా సైబర్ అంబాసిడర్లు యూనిఫామ్ లేని సైబర్ పోలీస్ ఆఫీసర్ లుగా ప్రత్యేక గుర్తింపును పొందుతూ, సైబర్ నేరాలకు సంబంధించి వీరు నేర్చుకున్న విషయాలను తోటి వారికి నేర్పుతారని తెలిపారు.
అనంతరం సైబర్ నేరాల గురించి నేర్చుకున్న విషయాలను ఇతరులకు నేర్పడమే కాక, షీ టీమ్స్ కు మరియు సమాజానికి మధ్య వారధిగా ఉంటూ పిల్లలు, స్త్రీలను రక్షించడానికి సమాజంలో తమ వంతు పాత్ర పోషిస్తామని అంబాసిడర్ల చేత అడిషనల్ SP గారు ప్రమాణం చేయించారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేయబడిన 50 స్కూల్ లలో కూడా సైబర్ అంబాసిడర్లకు సంబందిత పోలీస్ అధికారులు బ్యాడ్జ్ లను అందచేసి ప్రమాణం చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఉమన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి గారు, విద్యా శాఖ నుండి జెండర్ ఈక్విటీ డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ సుప్రియ గారు (GECO), యుంగిస్తాన్ ఫౌండేషన్ నుండి రాజేష్ గారు, పాఠశాల హెడ్ మాస్టర్ లింబాజీ గారు, మెంటర్ టీచర్ కల్పన గారు మరియు తోటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.