రాయల్ పోస్ట్ న్యూస్ నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని మోతే గ్రామం లో ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో భీమ్‌గల్ మండలానికి చెందిన పిప్రి బచాన్ పేల్లి గ్రామాలకు చెందిన ముగ్గురు యువకులు కలిసి ఆర్మూర్ కు బయల్దేరారు మార్గమధ్యంలో మోతే గ్రామ ఊరు చివరణ కారు నెంబర్ AP.28.CC.3559 లో గల వాహనం తాటి చెట్టుకి డీ కొనగా డ్రైవర్ మనోజ్ వయసు 22 మరియు డ్రైవరు వెనక కూర్చున్న శ్రవణ్ వయసు 21 ఏళ్ళు అక్కడికక్కడే మరణించాడు. డ్రైవర్ పక్కన కూర్చున్న భరత్ కి గాయలయ్యాయి. గాయాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కేసు నామోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వేల్పూర్ ఎస్ఐ భరత్ రెడ్డి తెలిపారు.