స్టాఫ్ రిపోర్టర్ : ఎస్ కె. సుభాన్ పాషా రాయల్ పోస్ట్ న్యూస్ బెల్లంపల్లి మంచిర్యాల :సింగరేణి ఏరియా హాస్పిటల్ పరిరక్షణకై, కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ధర్నా, బెల్లంపల్లి Dy.CMO గారికి వినతి పత్రం సమర్పణ..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద ఎఐ టియూసి ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ డిప్యూటీ సిఎంఓ కి వినతిపత్రం అందచేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవడం బాధకరమని వారు అన్నారు. వారికి యాజమాన్యం ఇచ్చే వేతనాలు సరిపోనప్పటికీ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని, ఉద్యోగ భద్రత ఉంటుందన్న ఆశతో కార్మికులు, కార్మిక కుటుంబాలకు కరోనా సమయంలో అనేక సేవలు అందించారన్నారు. నూతన టెండర్ వచ్చి రెండు నెలలు అవుతున్నా అధికార పార్టీ నాయకుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ నియామకాలు జరగడం లేదని వారు పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం అన్ని కార్మిక సంఘాలతో మాట్లాడి సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని వారు కోరారు. అదేవిధంగా సింగరేణి ఏరియా ఆసుపత్రిలో అన్ని వసతులతో కూడినవైద్యులను నియమించి నాణ్యత కలిగిన మందులను సరఫరా చేసి పూర్తిస్థాయిలో ఆస్పత్రిని నడిపించాలని వారు డిమాండ్ చేశారు.,స్టాఫ్ నర్స్ లేక వైద్యం అందక కార్మికులు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి లక్షలకు లక్షలు డబ్బులు వృధా చేసుకుంటున్నారని కాబట్టి పారామెడికల్, వైద్య సిబ్బందిని కొనసాగించాలని ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఎఐటియుసి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిప్ప నర్సయ్య – AITUC బెల్లంపల్లి బ్రాంచ్ ఇంచార్జీ ,
ఏ ఐ టి యు సి కేంద్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకటస్వామి, బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, కేంద్ర కార్యదర్శి భోగే ఉపేందర్ నాయకులు చిప్ప నరసయ్య శ్రీధర్, రంగ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.