స్టాఫ్ రిపోర్టర్ : ఎస్ కె. సుభాన్ పాషా రాయల్ పోస్ట్ న్యూస్ మంచిర్యాల :మంచిర్యాల జిల్లా, నెన్నెల మండలం, కోనంపేట గ్రామం బీజేపీ కార్యకర్త సీతారామ్ అనే గిరిజన యువకుని యొక్క 70 మామిడి చెట్లను నరికిన తెరాస నాయకులు, సంఘటన స్థలాన్ని పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ మరియు బీజేపీ నాయకులు

కోనంపేట గ్రామంలో పోడు భూముల గురించి కమిటీలు వేయగా అందులో చదువుకున్నవారిని వేయాలని సీతారాం అనె గిరిజన యువకుడు చదువుకున్న వారిని పెట్టాలని చెప్పడంతో టిఆర్ఎస్ కు చెందిన నాయకులు నీ సంగతి చూస్తాను చూడు అనే వార్నింగ్ ఇచ్చి తన తోటలో ఉన్న 70చెట్లను నరికేసారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా పోలీసులు వచ్చి వెరిఫికేషన్ చేసి వెళ్ళిపోయారు కానీ ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంతో మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖని డిమాండ్ చేసారు. రెండు రోజుల్లో ఈ సమస్యని పరిస్కారం చేయకపోతే జిల్లా కలెక్టర్ కలిసి ఈ గిరిజన కుటుంబానికి న్యాయం జరిగేలా ధర్నా కార్యక్రమం చేపడతాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొయ్యల హేమాజీ, ఎంపీటీసీ హరీష్ గౌడ్, తోట శ్రీనివాస్, శైలెందర్ సింగ్, గోవర్ధన్, అజ్మీరా శ్రీనివాస్,రాజులల్ యాదవ్, పట్టి వెంకట క్రిష్ణ, రాజకుమార్ మరియు బీజేపీ, బీజేవైఎం నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.