రాయల్ పోస్ట్ న్యూస్ సంగారెడ్డి: నిరుపేద విద్యార్థికి #MDR ఫౌండేషన్ చేయూతనందించింది. ఫౌండేషన్ చైర్మన్, టిఆర్ఎస్ నాయకులు, పటాన్చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారు మంగళవారం విద్యార్థి విష్ణువర్ధన్ రెడ్డికి 20 వేల రూపాయలు సహాయం అందజేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన సదరు విద్యార్థి పటాన్ చెరులో ఉంటూ విద్యనభ్యసిస్తున్నాడు. అతనికి ఎల్లంకి కళాశాలలో బీటెక్ లో సీటు వచ్చింది. కానీ పేదరికం కారణంగా ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నా ఆయన సహాయం చేయాలంటూ MDR ఫౌండేషన్ ను సంప్రదించారు. దీంతో అతని ఫీజు నిమిత్తం 20,000/- అందించిన దేవేందర్ రాజు గారు మాట్లాడుతూ మట్టిలో మాణిక్యం లాంటి అనేకమంది పేదలు ఆర్థిక స్థోమత లేక చదువుకు దూరమవుతున్నారు అని అన్నారు. మంచి మనసుతో ఇలాంటి వారికి ప్రోత్సాహాన్ని అందిస్తే దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదుగుతారని అన్నారు. చరిత్రలో అనేక మంది పేద వర్గాల నుండి వచ్చిన వారు దేశంలోని అత్యున్నత స్థానాలను అధిరోహించారని గుర్తుచేశారు. విష్ణువర్ధన్ రెడ్డి కూడా శ్రద్ధతో చదివి మరికొంతమందికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.