రాయల్ పోస్ట్ న్యూస్ షాద్నగర్:
రంగారెడ్డి జిల్లా, ఫరుఖ్ నగర్ మండలంలోని షాద్నగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత -పాఠశాలలో చదుపుచున్న 430 మంది బాలికలకు షాద నగర్ లోని ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ వ్యవస్థాపకులు గీతా తామస్ రెడ్డి చిత్త గారి అధ్వర్యంలో వారి ప్రతినిధి టీ. శ్రీనివాస్ ఒక్కొక్కరికి 3 చొప్పున 1290 నొట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు వ్రాత పుస్తకాలు తలరాతలు మారుస్తయని కావున ప్రతి ఒక్కరు దాతలు ఇచ్చిన సహాయాన్ని సద్వినియోగ పరచుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయు శ్రీమతిశివకుమారి మరియు ఉపాధ్యాయబ్బందం పాల్గొని సంస్థ వ్యవస్థాపకులకు ధన్యవాదములుతెలిపారు.