తార్నాక రోడ్ పై నాగు పాము హల్ చల్

రాయల్ పోస్ట్ న్యూస్ హైదరబాద్ :ఓయూ క్యాంపస్ నుండి తార్నాక వెళ్లే ప్రధాన రోడ్ పై నాగు పాము హల్ చల్ చేసింది. ప్రధాన రహదారి ఫుట్ పాత్ కు అనుకుని రోడ్ పై కదలకుండా చాలా సేపు అక్కడే ఉన్నది. ఆ దారిలో వెళుతున్న వాహనదారులు పాము ను చూసి భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఓయూ పోలీస్ లు ఆ ప్రదేశానికి చేరుకుని ట్రాఫిక్ ను పక్కకు మళ్లించారు. ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ సభ్యుడు శివ కృష్ణ ఆ ప్రదేశానికి చేరుకుని పామును పట్టుకోవడం తో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. నాగుపాము 5 అడుగులు ఉంటుందని స్నేక్ సొసైటీ సభ్యుడు శివ కృష్ణ తెలిపారు.