రాయల్ పోస్ట్ న్యూస్ రంగారెడ్డి :నాచారం డివిజన్ కు చెందిన
ప్రముఖ వ్యాపారవేత్త,సంఘ సేవకులు సిఎస్ బ్రదర్స్ మల్లేష్ ఉత్తమ సేవలు అందించినందుకు గాను శిఖరం ఆర్ట్స్ థియేటర్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో డా.అబ్దుల్ కలాం ఎక్స్ లెన్స్ అవార్డుకు ఎంపిక అయ్యారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మల్లేష్ ఢిల్లీ లో జరిగిన అవార్డు ప్రధానొత్సవ కార్యక్రమానికి హాజరు కాలేని కారణంగా మల్లేష్ కు కు ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, గారు ,శివ నర్సింహా తంత్రి గురు స్వామి లు నాచారం లో అవార్డు ప్రదానం చేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెర్లపల్లి డివిజన్ అధ్యక్షులు నాదం, మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ , మల్క ప్రకాష్ అనిత రెడ్డి, మంజుల వాణి, రవికాంత్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.