రాయల్ పోస్ట్ న్యూస్ నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని బెజ్జోర గ్రామ రైతులు భీంగల్ బస్టాండ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు అనంతరం ర్యాలీగా వెళ్లి భీంగల్ ఎమ్మార్వో కు వినతి పత్రం ఇచ్చారు. సొసైటీ ఆధ్వర్యంలో వడ్లు జోకుతున్న కడ్త పేరిట నాలుగు కిలోలు వరకు కోత విధిస్తున్నారని సొసైటీ డైరెక్టర్లు సొసైటీ చైర్మన్ రైస్ మిల్లర్లు ఒక్కటై రైతుల్ని నిండా ముంచుతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. వినతిపత్రం అందుకున్న భీంగల్ ఎమ్మార్వో బెజ్జోర గ్రామానికి వెళ్లి తాడిపచ్యు సెంటర్లలో ఎమ్మార్వో రైతుల ముందు వడ్ల కాంట నిర్వహిస్తున్న అధికారులను పూర్తి వివరాలు తెలుసుకొని జేబీఎల్ మిల్లు నడ్కుడ, పాలెం రైస్ మిల్లు లో కడ్త పేరిట కోత విధించకూడదని రైస్ మిల్లర్ల తో మాట్లాడి డి.ఎస్. ఓ గారి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించామని భీంగల్ ఎమ్మార్వో తెలిపారు.