రాయల్ పోస్ట్ న్యూస్ నిజామాబాద్ : నిజామాబాద్ స్థానిక ఎమ్మెల్సీ స్థాననికి కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 1.45 నిమిషాలకు నామినేషన్ కేంద్రంలోకి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రం అందజేశారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత తరపున మరో మూడు సెట్ల నామినేషన్ పత్రాలను ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. గత ఏడాది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుపొందిన కల్వకుంట్ల కవిత మరోసారి పోటీ చేయనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత. ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. మరోసారి అవకాశం ఇచ్చిన టిఆర్ఎస్ పార్టీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.