రాయల్ పోస్ట్ న్యూస్ అబ్దుల్లాపూర్ మెట్ హైదరబాద్: మండల పరిధిలో ఇనాం గూడ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గ్రామ సర్పంచ్ అంతటి యశోద ఉషయ్య గౌడ్,ఉప్పసర్పంచ్ దేశం అచిలేశ్ గౌడ్,వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, గ్రామ ఎంపీటీసీ సిక సాయి కుమార్ తో కలిసి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన మండల ఎంపీపీ బుర్ర రేఖ మహేంధర్ గౌడ్,మండల జడ్పీటీసీ బింగి దాసు గౌడ్ 24 సీసీ కెమెరాలను సుమారు 6లక్షల రూపాయల వ్యయంతో ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసుల తో సమానం అన్నారు.
సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం చాలా శుభపరిణామన్నారు. అదే విధంగా రానున్న రోజుల్లో మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో ఏర్పాటు చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ మెట్ సిఐ స్వామి ,ఎస్ ఐ వీర భద్రం, గ్రామం వార్డ్ మెంబర్
అంతటి రవీందర్ గౌడ్,అంతటి బాలశివుడు,అంతటి సుధాకర్ గౌడ్,అంతటి భాస్కర్ గౌడ్, అంతటి లింగస్వామి గౌడ్,నీల శ్రీకాంత్ గౌడ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.