రాయల్ పోస్ట్ న్యూస్ mahboobabad: అదైర్యపడవద్దు.. అన్ని విధాలుగా ఆదుకుంటాం.. అండగా ఉంటాం.. చిన్నారుల కన్నీరు తుడిచిన కలెక్టర్ శశాంక.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గందంపల్లిలో విద్యుత్ షాక్ తో తల్లిదండ్రులు మరణించడంతో అనాధలుగా మారిన చిన్నారులను ఇంటికి వెళ్ళి పలకరించి.. దైర్యం చెప్పారు కలెక్టర్ శశాంక.. మానుకోట యంపి మాలోత్.కవిత పోన్ ద్వారా., మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ఆ..చిన్నారులకు దైర్యాన్ని..సంపూర్ణ సహాయాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. దీనిపై మానవత హృదయంతో స్పందించిన కలెక్టర్ శశాంక తానే స్వయంగా వారి ఇంటికి వెళ్ళి ఆత్మీయంగా మాట్లాడారు. అమ్మా..నాన్న లేని లోటు తీర్చలేనిదే అయినా కన్నీళ్ళు..కష్టాలు మీ..ఉజ్వలభవిష్యత్ కు ఆటంకం కావద్దని.. మీకు అండగా జిల్లాయంత్రాంగం ఉంటుందని చెపుతూ.. చిన్నారులను ఓదార్చారు. జిల్లాకలెక్టరే తమ వద్దకు స్వయంగా కదలివచ్చి.. కంటినీరు తూడ్చడంతో చాలా..రోజుల తర్వాత చిన్నారులలో కొంత దైర్యం కనిపించింది.