రాయల్ పోస్ట్ న్యూస్ నిజామాబాద్ జిల్లా: వేల్పూర్ మండలం లక్కోరా గ్రామంలో నిజామాబాద్ స్పైస్ బోర్డ్ ఆధ్వర్యంలో స్పైస్ బోర్డ్ అధికారులు, అగ్రికల్చర్, హార్టికల్చర్, నాబార్ట్ మరియు రైల్వే అధికారుల తో పసుపు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో పసుపు పంట నాట్లు వేయడం దగ్గరి నుంచి దిగుబడులు ఎలా పెంచుకోవాలి, రోగాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పంట ఎగుమతులు, మార్కెటింగ్ లింకేజీ సంబంధించి వివరించడం జరిగింది. అలాగే పసుపుకు అత్యధిక ధర రావాలంటే కర్క్యుమిన్ అధికంగా ఉండే వంగడాలని పండించాలని, సేంద్రియంగా సాగుచేయడం వలన కలిగే లాభాలను నిపుణులు రైతులకు వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పంట సాగులో అనుసరించాల్సిన మార్పులపై కూడా నిపుణులు సలహాలు ఇచ్చారు.కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై , రుణ సౌకర్యాల గురించి స్పైస్ బోర్డ్ అధికారులు, నాబార్డ్ ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఇక పసుపు రవాణా కోసం ఆసియాలోని అతిపెద్ద పసుపు మార్కెట్ మహారాష్ట్రలోని సాంగ్లీ వరకూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలు వివరాలను రైల్వే శాఖ అధికారులు రైతులకు వివరించారు. అలాగే ఆ రైలును ఎలా బుక్ చేసుకోవాలి, ఎంత లాభదాయకంగా ఉంటుందో వివరించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా సేంద్రియ పద్దతిలో పసుపును ఎలా పండించాలో శాస్త్రవేత్తలు వివరించారు. ప్రస్తుతం సేంద్రియ పద్దతిలో పండించిన పంటకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉందని, రైతులు ఆ దిశగా సాగాలని సూచించారు. పసుపు నాణ్యత అందులో ఉండే కర్క్యుమిన్ పైన ఆధారపడి ఉంటుందని కర్క్యుమిన్ ఎక్కువ ఉంటే పసుపు ధర ఎక్కువ పలుకుతుందని రైతులకు వివరించారు. ప్రస్తుతం రైతులు పండించే రకాలలో కర్క్యుమిన్ శాతం తక్కువగా ఉంటుందని అందుకే కర్క్యుమిన్ అధికంగా ఉండే రాజేంద్ర సోని, పీతాంబరి రకాలను రైతులు సాగుచేయాలని శాస్త్రవేత్తలు సూచించారు. అందుకు సంబంధించిన సలహాలు సూచనలు , సహాయ సహకారాలు స్థానిక స్పైస్ బోర్డ్ అధికారులు అందిస్తారని భరోసా ఇచ్చారు.ప్రధానంగా 3 సీజన్ల వరకూ సేంద్రియ పద్దతిలో పసుపు ను సాగుచేయడం పైన శాస్త్రవేత్తలు, అధికారులు రైతులను ప్రోత్సహించారు. తద్వారా పసుపు లో రసాయనాల శాతం తగ్గి సేంద్రియ విలువలు పెరిగి పసుపుకు అధిక ధర లభించమే కాకుండా విదేశాలకు ఎగుమతులకు అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. రైతులు పసుపు పండించే విధానం కూడా మారాలని రైతులు ఇంకా పాత పద్దతులలో కాకుండా ఆధునిక విధానాలను అనుసరించాలని అప్పుడు పసుపుకు రోగాల బెడద కూడా తగ్గుతుందని నిపుణులు సలహాలిచ్చారు.
సేంద్రియ సాగుకు గాను నాబార్డ్ ద్వారా రైతులకు 2 కోట్ల రూపాయల వరకూ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా రుణాలు అందచేయడానికి సిద్దంగా ఉన్నామని నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నాగేష్ రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రైల్వే అధికారులతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కూడా పాల్గోన్నారు. పసుపు రవాణా కోసం నిజామాబాద్ నుంచి సాంగ్లీ వరకూ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు వివరాలు, ఆ రైలు ను బుక్ చేసుకునే విధానం గురించి రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపి అర్వింద్ మాట్లాడుతూ పసుపు సాగు మొదలు అయ్యే నాటి నుండి కొనుగోలు వరకు కేంద్రప్రభుత్వం రైతులకు పలు రకాల రాయితీలు ఇస్తుందని అన్నారు..భారత దేశంలో పసుపు అత్యధికంగా పండించేది నిజామాబాద్ , జిగిత్యాల జిల్లాల రైతులని అయితే మార్కెట్లో మంచి ధర రావాలంటే రైతులు ఆర్గానిక్ పసుపు మీద దృష్టి పెట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ భీమా పథకం తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి ప్రభుత్వం అమలు చేయడం లేదు కాబట్టి ప్రత్యామ్నాయంగా రైతులకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ సాధ్యాసాధ్యాల గురించి కూడా అర్వింద్ అధికారులతో చర్చించారు.మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు విధానంలో కూడా మార్పులు చేసుకోవాలని అప్పుడే పసుపు నాణ్యత పెరుగుతుందని చెప్పారు. ఇక స్పైస్ బోర్డ్ రైతులకు అమ్మకానికి మరియు ఎగుమతులకు సంబంధించి పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన కర్క్యుమిన్ కొలిచే యంత్రం వలన రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. అలాగే ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల పసుపు రైతులు కొంచెం నష్టపోయారని , వారికి మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీం కింద సహాయం అందేలా చూస్తామని కూడా భరోసా ఇచ్చారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న అధికారుల వివరాలు
ఎన్. సుందరేషన్
డిప్యూటి డైరెక్టర్
రీజనల్ ఆఫీస్ కం ఎక్స్ టెన్షన్ సెంటర్ స్పైస్ బోర్డ్
నిజామాబాద్
డా. మహేంధర్
హెడ్ సైంటిస్ట్
టర్మరిక్ రీసెర్చ్ స్టేషన్
కామారెడ్డినాగేష్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, నాబార్డ్ నిజామాబాద్ డా. ఎస్ నవీన్ కుమార్
సీనియర్ సైంటిస్ట్ అండ్ కృషి విజ్ఞాన కేంద్రం
నిజామాబాద్
జాన్ బెన్హర్ అసిస్టెంట్ కమర్షిల్ మేనేజర్
హైదరబాద్ డివిజన్, సౌత్ సెంట్రల్ రైల్వే రవికుమార్
సిసిఐ హైదరాబాద్ రైల్వే నితీష్ హుడా సిసిఐ
నిజామాబాద్ రైల్వే
గోపు కిషోర్
చీఫ్ గూడ్స్ సూపర్ వైజర్