రాయల్ పోస్ట్ న్యూస్ మంచిర్యాల, : సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. మధ్యాహ్న భోజన కార్మిక సం ఘం జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరి మాట్లాడుతూ పాఠశాలల్లో 20 సంవత్సరాల నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నామని, కానీ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదన్నారు. కరోనా కష్టకాలంలో కూడా తమకు ప్రభుత్వం ఎలాం టి సహాయం అందించలేదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెను చార్జీలు పెంచాలని, కోడిగుడ్లను ప్రభుత్వమే ఉచితంగా అందించాలని, కనీస వేతనం రూ. 21 వేలు చెల్లించాలని, రిస్క్‌ అలవెన్స్‌ రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మధ్యాహ్న భోజన నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే నిర్ణయా న్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదబీమా, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో లక్ష్మీ, రబియా, కళావతి, భూలక్ష్మీ, అనసూయ, కరుణ, శంకరమ్మ, రజిత, లత, దేవయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు రంజిత్‌ కుమామమర్‌ విజయ్ పాల్గొన్నారు..