రాయల్ పోస్ట్ న్యూస్మెదక్ :రోడ్డుపై పోసిన వడ్ల కుప్పకు ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి మిరుదొడ్డి మండలం భూంపల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది.

ఎనగుర్తి గ్రామానికి చెందిన ప్రభు(28) అదివారం రాత్రి బైక్‌పై తన బంధువు దానయ్యతో కలిసి ఎనగుర్తి వైపు వెళ్తున్నాడు. భూంపల్లి గ్రామ సమీపంలో రహదారిపై నల్లని పాలీథీన్‌ కవర్‌ కప్పి ధాన్యం కుప్ప ఉండడంతో చీకటిలో కనిపించక ఢీకొంది. ప్రభు బైక్‌పై నుంచి రహదారిపై ఎగిరిపడి, అక్కడిక్కడే మృతి చెందాడు. దానయ్యకు గాయాలయ్యాయి. ప్రభుకు భార్య రాధ, ఇద్దరు పిల్లలు ఉన్నారు