రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి :యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా మోడల్ స్కూల్ హాస్టల్స్ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి MD. ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ రోజు సోమవారం మోడల్ స్కూల్ హాస్టల్స్ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి గారికి వినతి పత్రం సమర్పించారు, ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ హాస్టల్స్ లో పనిచేస్తున్న కేర్ టేకర్, ఏ.ఎన్.ఎం, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, వాచ్ ఉమేన్ కార్మికులకు ప్రతి నెల కేవలం రూ.6 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, నిత్యం పెరుగుతున్న నిత్యావసర ధరల వలన కేవలం 6 వేల రూపాయలతో కుటుంబాలు ఎలా గడుస్తాయి అని ఆయన ప్రభుత్వానికి ప్రశ్నించారు. 2015 నుండి పనిచేస్తున్న కార్మికులకు ఏడు సంవత్సరాలు గడిచినా నేటికీ వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ మరియు గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు, ESI, PF సౌకర్యాలు అమలు చేయకుండా కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని విమర్శించారు, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం రూ.24 వేల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సరిత, స్వప్న,రేణుక,మాధవి, మంజుల,ఉమా,ప్రమీల, శారద,లక్ష్మీ,రాణి, జానీ బి, మీనా,జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.