రాయల్ పోస్ట్ న్యూస్ హైదరబాద్: గౌరవనీయులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి నమస్కారం.
మీరు మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని 2004 లో హామీ ఇచ్చారు. 12 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాదని మీకు, మాకు అందరికీ తెలిసిన విషయమే. ఆచరణ సాధ్యంకాని వాగ్దానం చేశారు. హైదరాబాద్ లో డిప్యూటీ మేయర్ గా ఉన్న పదవి మైనారిటీలకు లేకుండా చేశారు. జిల్లా పరిషత్తులలో ఎవరికీ అవకాశం కల్పించలేదు. మునిసిపాలిటీలలో 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదు. మంత్రివర్గంలో ఒక్కరికే అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యే సీట్ల కేటాయింపులో 12 శాతం రిజర్వేషన్లు లేవు. ఏడున్నర సంవత్సరాలలో ఒక్క మైనారిటీకి రాజ్యసభలో అవకాశం కల్పించలేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరు మైనారిటీలు రాజ్యసభ సభ్యులుగా ఉండేవారు. ఇక ఇటీవల 19 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఉన్న ఒక్క మైనారిటీ అభ్యర్థి ఫరీదుద్దీన్ ఎమ్మెలీసీ పదవీకాలం పూర్తయ్యింది. కానీ మళ్ళీ మైనారిటీ అభ్యర్థి ఎవరికీ అవకాశం కల్పించలేదు. ముస్లింలు, క్రిష్టియన్లతో పాటు ఇతర మైనారిటీ మతస్థులు 20 శాతం మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కనీసం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో కనీసం ఒకరికైనా అవకాశం కల్పించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి లేకుంటే
భవివిష్యత్తులో జరిగే ప్రతి ఎన్నికల్లో మైనారిటీలు
టీఆరెస్ కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు.