అరుణ రాయల్ పోస్ట్ న్యూస్ ఆత్మకూర్ యాదాద్రి భువనగిరి జిల్లా :ఆత్మకూరు మండలంలో వరి ధాన్యం కల్లాలను పరిశీలించిన ఆలేరు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లూరి రామచంద్రా రెడ్డి.

ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు రైతులు చెమటోడ్చి ఆరుగాలం పండించిన వరి పంటను కోసి కల్లాల్లో ,మార్కెట్లో పోసి నెల రోజులు గడుస్తున్నా నేటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం కొనకపోవడం సిగ్గు చేటు అన్నారు

టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు కేవలం ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికే పరిమితం అయ్యారు అని

ధాన్యం వర్షం పాలు అయ్యి రైతులు ఏడుస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాసింగ్ పంట మీద నాటకాలు ఆడుతోందని విమర్శించారు

ఇప్పుడున్న పంటను కొనుగోలు చేయకుండా యాసింగ్ పంట కొనుగోలు చేయాలని ఢిల్లీకి వెళ్ళడంలో అంతరార్థం ఏమిటో సీఎం కెసిఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు

తక్షణమే టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించి ఎలాంటి నిబంధనలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని యాశింగ్ వరి పంట పై ఆంక్షలు విధించ కూడదని లేదంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వారితో పాటు ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్దులు గౌడ్, కిసాన్ సెల్ అధ్యక్షుడు నాగం లక్ష్మారెడ్డి,సర్పంచ్ జన్నాయికోడె నగేష్,PACS డైరెక్టర్ లు నోముల వెంకట్ రెడ్డి, బొడిగే వెంకన్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగాని మల్లేష్ గౌడ్,నాయకులు తుమ్మల నర్సిరెడ్డి, కందడి దశరథ రెడ్డి,ఎద్దు వెంకన్న,రంగ స్వామి,కోరే మల్లేశం,ఎలగందుల శ్రీను,యూత్ నాయకులు చిత్తర్ల అనిల్,తొండల అనిల్,పల్సం మహేష్, కానుకుంట్ల మహేష్ తదితర నాయకులు పాల్గొన్నారు