రాయల్ పోస్ట్ న్యూస్ నల్లగొండ : ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ తెలిపారు.

ప్రజల సౌకర్యార్థం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. తన భూమి సమస్యను తెలియజేయడం కోసం అంబులెన్స్ లో జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన బాధితుని దగ్గరకు నేరుగా వెళ్లి సమస్యను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై వేగంగా స్పందించి పోలీసు సేవలు అందజేయాలన్నారు. ప్రతి ఫిర్యాదుదారునికి భరోసా, నమ్మకం కలిగించాలని, ప్రజల యొక్క ఫిర్యాదులను స్వీకరించడానికి జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక విభాగం పని చేస్తున్నదని, ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. .