రాయల్ పోస్ట్ న్యూస్ సూర్యాపేట :రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో 30 వేలకు పైగా, సూర్యాపేట జిల్లాలో వెయ్యి పైగా పారిశుధ్య కార్మికులు( స్కావెంజర్స్) విధులు నిర్వర్తించరని వీరిని విధుల నుండి ప్రభుత్వం తొలగించిదని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సూర్యాపేట కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి, అనంతరం కెలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర నాయకులు గంటా, నాగయ్య పాల్గొని మాట్లాడుతూ కరోనా కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలలు,మరుగుదొడ్లు శుభ్రం చేసే స్కావెంజర్ లను కొనసాగించకుండా రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం సిగ్గుచేటన్నారు.కరోన నేపథ్యంలో మాస్క్ లు పెట్టుకోకపోతే 1000/-రూపాయలు జరిమానా విధించాలని ఆర్డర్ జారీ చేసిన కేసీఆర్ నేడు పాఠశాలల్లో స్కావెంజర్ లను తొలగించినందుకు ఎంత జరిమానా విధించాలని ప్రభుత్వన్ని ప్రశ్నించారు.పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల పరిశుభ్రత బాధ్యత నూతన పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం మల్టిపర్పస్ వర్కర్స్ కు అప్పచెప్పారు,దీనితో వారికి పని భారం పెరిగిందని చేయలేమని చెప్తున్న అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కొన్ని జిల్లాలో ఇంతకు ముందు పనిచేసిన స్కావెంజర్ లను గ్రామపంచాయితి/మున్సిపల్ పరిధిలోకి తీసుకొని జీతాలు ఇవ్వాలని సర్క్యులర్ జారీచేశారు,అదేవిదంగా సూర్యాపేట జిల్లాలో స్కావెంజర్ లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.స్కావెంజర్ లకు ఉపాధి భద్రత కల్పించి, వేతనాలు పెంచాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అర్ధాంతరంగా విధుల నుండి తొలగించడంతో జిల్లాలో 1000మంది పారిశుద్ధ్య కార్మికులకు దిక్కుతోచని స్థితి ఏర్పడిందని అన్నారు.తక్షణమే స్కావెంజర్ లను విధుల్లోకి తీసుకోవాలని లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో IFTU జిల్లా అధ్యక్షలు కామళ్ల నవీన్,IFTU జిల్లా నాయకులు దేసోజు మధు,PDSU జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్,ప్రగతిశీల ప్రభుత్వ పాఠశాలల స్కావెంజర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె.లక్ష్మీ, యూనియన్ నాయకులు జానయ్య, వెంకటేశ్వర్లు,ఉమా, నిలమ్మ, నెహ్రు,అశోక్,చంద్రయ్య,పద్మ,వెంకటమ్మా ,బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు