అరుణ రాయల్ పోస్ట్ న్యూస్ ఆత్మకూర్ ( ఎం). : రాయగిరి- మోత్కూర్ మెయిన్ రోడ్డు లో గల రాయిపల్లి కొండాపురం మధ్యలో కల్వర్టు,రోడ్డు పనులు జరుగుతున్న సమయంలో ప్రతి రోజు ఏదో ఒక వాహనము దిగబడి ప్రయాణికులకు చాలా ఇబ్బంది జరుగుతున్నందున ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే శ్రీ మతి శ్రీ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు ,మరియు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారిఆదేశానుసారం ఆత్మకూరు ఎం టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ గారు వెంటనే స్పందించి నేరుగా కాల్వర్టు మీది నుండే వాహనాలు పోయే విధంగా R&B AE,గారితో మాట్లాడి మొరాన్ని పోయించి వాహనాలు సులువుగా పోయే విధంగా 24 గంటల్లో పని పూర్తి చేసి ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోయేలా పని చేస్తామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాస ఇంద్రారెడ్డి, పంజాల వెంకటేష్ గౌడ్, కోరే బిక్షపతి, గడ్డం దశరథ గౌడ్, బూడిద శేఖర్ గౌడ్, కోరే వెంకన్న రాయిపల్లిగ్రామ సర్పంచ్ పంజాల సుమతీ, శ్రీనివాస్ గౌడ్ ,ఎండి అజీమోద్దిన్, నాతి. స్వామిగౌడ్ ఎండి హైమద్ ,తదితరులు పాల్గొన్నారు.