రాయల్ పోస్ట్ న్యూస్ సూర్యాపేట :కార్తీక మాసం మూడవ సోమవారం పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్య సాంబ శివ స్వామి స్వామి వారికి ప్రత్యేక అభిషేకం లు నిర్వహించారు.భక్తులు స్వయంగా స్వామి వారి గర్భ గుడి లోనికి ప్రవేశించి వారి స్వహస్థలతో అభిషేకములు నిర్వహించుకున్నారు.కార్తీక మాసం లో విశేష మైన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతములు సామూహికంగా నిర్వహించారు.శ్రీ సత్య సాంబ శివ స్వామి వారికి అర్చకులు అన్నాభిషేకం నిర్వహిచారు..దేవాలయ మండపంలో శివలింగ ఆకృతిలో దిపోత్సవం నిర్వహించారు.భక్తులు సామాజిక దూరం పాటిస్తూ అభిషేకములు నిర్వహించారు. కార్తీక పురాణం వ్రత కథను భక్తులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష,కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా,ప్రధాన కార్యదర్శి బ్రాహ్మ0డ్లపల్లి మురళీధర్ ,ఉత్సవ కన్వీనర్ నరేంద్రుని విద్యాసాగర్ రావు, బ్రాహ్మణపల్లి బ్రాహ్మయ్య, అన్నదాన కన్వీనర్లు బ్రాహ్మ0డ్లపల్లి దేవిదత్తు, కొత్త మల్లి కార్జున్ కమిటీ సభ్యులు భేలిదే అశోక్,సోమా శ్రీశైలం దేవరశెట్టి సోమయ్య, దేవాలయ అర్చకులు వంశీకృష్ణశర్మ, బాబ్జి శర్మ,దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు..